మొబైల్ ఫోన్ ప్రియులకు ఇక చుక్కలే..   - MicTv.in - Telugu News
mictv telugu

మొబైల్ ఫోన్ ప్రియులకు ఇక చుక్కలే..  

February 1, 2018

అందరికీ టెక్నాలజీ,ఇంటింటికీ ఇంటర్నెట్ అని ప్రభుత్వాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిదానికి ఆన్ లైన్, అని ఫోన్ నంబర్ అని, పాస్ వర్డ్ అనీ అనీ చెబుతుండడంతో జనం తప్పనిసరిగి మొబైల్ ఫోన్లను కొనక తప్పడం లేదు. దీన్ని సాకుగా తీసుకుని కేంద్ర సర్కారు ఈ ఫోన్ల ధరలను భారీగా పెంచేసే ప్రతిపాదనలను బడ్జెట్లో పెట్టింది.జైట్లీ ప్రతిపాదనల వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు చుక్కలు అంటనున్నాయి. మొబైల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచిపడేశారు. అంటే వంద రూపాయల ఫోన్‌పై 20 రూపాలయ వడ్డింపు అన్నమాట. దేశ స్వావలంబన కోసం ఉద్దేశించిన  మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీ సంస్థల ప్రోత్సాహం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని జైట్లీ చెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయమన్నారు. కాగా, టీవీలపై పన్నును కూడా 15 శాతానికి పెంచారు.