పోలీస్ స్టేషన్‌లో భారీ చోరీ.. గుర్తుతెలియని వాళ్ల పని అంట..  - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ స్టేషన్‌లో భారీ చోరీ.. గుర్తుతెలియని వాళ్ల పని అంట.. 

January 14, 2020

bn kj

ఇళ్లలో, గుళ్లలో, బ్యాంకుల్లో, బస్సుల్లో, రైళ్లలో.. మరెన్నో చోట్ల దొంగతనాలు అత్యంత సహజంగా సాగిపోతుంటాయి. కానీ పోలీస్ స్టేషన్లలో చోరీలు జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఓ ఠాణాపై ‘గుర్తుతెలియని వ్యక్తులు’ కన్నేసి కొల్లగొట్టారు. లక్షల విలువైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని జరిగిందీ సంఘటన. 

జైసింగ్‌పూర్  పోలీస్ స్టేషన్‌లోని  స్టోర్ రూపంలో ఉంచిన 185 మొబైల్ ఫోన్లను ఎవరో ఎత్తుకెళ్లారని అక్కడి పోలీసులు కేసు రాసుకున్నారు. చోరీలు, బెదిరింపులు వంటి కేసుల్లో వీటిని స్వాధీనం చేసుకుని స్టోర్ రూంలో పెట్టామని, గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాయని వాపోతున్నారు. అయితే ఇది ఇంటి దొంగల పనే అయ్యుంటుదని, ఠాణాలోకి వెళ్లి అన్నేసి ఫోన్లను చోరీ చేయడం ఎంతటి గజదొంగలకైనా సాధ్యమయ్యే పని కాదని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.