ఫోన్ వచ్చిందని లిఫ్ట్ చేస్తే పెట్రోల్ పంపులో మంటలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ వచ్చిందని లిఫ్ట్ చేస్తే పెట్రోల్ పంపులో మంటలు 

October 22, 2019

పెట్రోల్ పంపులో సెల్‌ఫోన్ వాడకూడదని చెప్పినా దాన్ని పాటించే వారు చాలా తక్కువ. చిన్న అజాగ్రత్త ఎలాంటి అపాయం తెచ్చిపెడుతుందో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన ఘటననే ఓ ఉదాహరణగా భావించవచ్చు. పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తం కారణంగా  తృటిలో ప్రమాదం తప్పింది. 

ఈనెల 20న శ్యాంసుందర్‌ పెట్రోల్‌ పంపులో ఇద్దరు వ్యక్తులు బైక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లారు. పెట్రోల్ నింపుతుండగానే.. ఫోన్ కాల్ రావడంతో దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే మంటలు వ్యాపించాయి. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. అయితే పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.