పంది మాంసం గొంతులో ఇరుక్కొని మోడల్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పంది మాంసం గొంతులో ఇరుక్కొని మోడల్ మృతి

June 10, 2022

Model Arisara dies after choking on pork in thailand

థాయ్‌లాండ్‌కు చెందిన 27 ఏళ్ల ప్రముఖ మోడల్ అరిసారా కర్బ్‌దెచో అనూహ్య రీతిలో మరణించింది. గత మార్చిలో పంది మాంసం కబాబ్ తింటూ ముక్క గొంతులో ఇరుక్కుపోగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు నెలల చికిత్స అనంతరం జూన్ 6న చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలను జూన్ 11న నిర్వహించనున్నారు. ఈ వార్త విన్న ఆమె ఫ్రెండ్స్, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అరిసారాకి ఇన్‌స్టాగ్రాంలో 15 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అక్కడ ఈమె సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ‘ఎప్పుడూ చలాకీగా ఉండేది. దాంతో పాటు చాలా బిజీగా కూడా ఉండేది. కనీసం తిండి తినడానికి కూడా సమయం ఉండేది కాదు. ఓ రోజు జిగురుగా ఉన్న అన్నంతో పాటు పోర్క్ కబాబ్ తిన్నది. ప్రమాదవశాత్తూ ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది’ అంటూ 57 ఏళ్ల ఆమె తల్లి సుపిచా తెలిపింది. కాగా, మరణవార్త తెలియగానే చాలా మంది ఫాలోవర్లు రిప్ అంటూ మెసేజులు చేస్తున్నారు.