ఆమె ఎత్తు మూడు అడుగులు.. ఆత్మవిశ్వాసం అనంతం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె ఎత్తు మూడు అడుగులు.. ఆత్మవిశ్వాసం అనంతం..

November 20, 2017

కారెవరూ మోడలింగ్‌కు అనర్హం. మిగతావారికి భిన్నంగా ఉంటే మరిన్ని అవకాశాలు బోలెడు. మోడలింగ్ ప్రపంచాన్ని దున్నేస్తున్నఅమెరికన్ మరుగుజ్జు సందరి ద్రు ప్రెస్టా ఇందుకు ఉదాహరణ. కేవలం 3 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. బికినీ, ఫ్యాషన్ దుస్తులు, టైట్ జీన్స్.. ఏవైనా సరే వాటికి ఇదివరకు మనమెన్నడూ చూడని అందాలను జోడించి చూపరులను కన్నుతిప్పుకోకుండా చేస్తోంది.‘నా జీవితం ఇంతేనని నిరాశపడలేదు లేను. నా ఎత్తును ఒక అవకాశంగా మార్చకున్నాను. సానూకూల దృక్పథంతో ముందుకెళ్లాను. ప్రతిభకు ఎత్తు కొలమానం కానేదు.. 15ఏళ్లు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నా ప్రతిభను నిరూపించుకున్నా’ అని ద్రు ప్రెస్టా చెబుతోంది. మొదట మోడలింగ్‌లోకి ప్రవేశించినప్పుడు అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నానని, అయినా దృఢసంకల్పంతో వాటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని అంటోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె ఫొటోను చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం..