చెన్నైలో ఓ మోడల్ మూడు రోజులుగా కనిపించడం లేదు. గానమ్ నాయర్ అనే 28 ఏళ్ల మోడల్ జాడను పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు గానమ్ జాడ కోసం సోషల్ మీడియాలో వేట ప్రారంభించారు.
ఓ సెలూన్లో మార్కెటింగ్ మేనేజర్‌గా ఆమె పనిచేస్తుంది. శుక్రవారం కూడా ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన గానమ్.. కనిపించకుండా పోయింది. ఆమె ఆఫీస్‌కు కూడా వెళ్లలేదు. మొబైల్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో గానమ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలతో పాటు పెళ్లి విషయంలోనూ కుటుంబ సభ్యులతో గానమ్ విభేదించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.