మందుకొట్టి.. 20వ అంతస్తు నుంచి పడిపోయి మోడల్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మందుకొట్టి.. 20వ అంతస్తు నుంచి పడిపోయి మోడల్ మృతి

December 11, 2017

మద్యం చాలా అనర్థాలు తెలుస్తుంది. తలతిక్కగా మాట్లాడిస్తుంది. కొట్టిస్తుంది, కొట్టించుకుంటుంది.. ఇంకా ఏమేమో చేస్తుంది. చివరకు ప్రాణాలు కూడా తీస్తుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఒక మోడల్ ఓ బహుళ అంతస్తుల భవనంలోని 20వ అంతస్తునుంచ కింద పడి చనిపోయింది.

ఆ సమయంలో ఆమె పూర్తిగా మద్యం మత్తులో ఉంది. నెదర్లాండ్స్‌కు చెందిన 19 ఏళ్ల ఇవానా ఇస్తాన్ రాబర్ట్ స్మిట్ ఇప్పుడిప్పుడే మోడలింగ్ లో పేరు తెచ్చుకుంటోంది. కౌలాలంపూర్లోని జలన్ డాంగ్ వాంగీ భవనంలో ఓ మందు పార్టీలో పాల్గొంది. మద్యం మత్తులో బాల్కనీలోకి వచ్చింది. ఏం జరిగిందో తెలియదు గాని అక్కడి నుంచి పడిపోయింది. ఆరో అంతస్తులోని బాల్కనీలో ఆమె మృతదేహం పూర్తి నగ్నంగా కనిపించింది. తాగిన మైకంలో చనిపోయిందో లేకపోతే ఎవరైనా తోసేశారో తెలియడం లేదు.