గుళ్లో బట్టలు విప్పి జైల్లో పడింది... - MicTv.in - Telugu News
mictv telugu

గుళ్లో బట్టలు విప్పి జైల్లో పడింది…

September 11, 2017

ఎక్కడైనా బావగాని వంగతోట కాడ బావ కాడని సామెత. పాపం..  బెల్జియన్ మోడల్ మరిసా పాపెన్ కు ఈ సంగతి తెలియక చిక్కుల్లో పడింది. ఆమె ఇటీవల ఈజిప్టులోని లక్సర్ లో ఉన్న ప్రాచీన గుళ్లు, పిరమిడ్ల వద్ద న్యూడ్ ఫొటో షూట్ దిగింది. దీనికి ముందు.. మరిసా, ఆమె ఫొటోగ్రాఫర్  అక్కడి కుర్రకారుకు డబ్బులిచ్చి తమకు అడ్డం రాకుండా మేనేజ్ చేసుకున్నారు.

అయితే షూట్ జరుగుతుండగా అక్కడికి భద్రతాధికారులు రావడంతో కథ అడ్డం తిరిగింది. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరిగిందని పాపెన్ ను, ఫొటోగ్రాఫర్ ను  అరెస్ట్ చేసి ఒక రాత్రి జైల్లో నిర్బంధించారు. తర్వాత బెయిల్ పై వదిలేశారు. తాను గతంలో 50 దేశాల్లో నగ్నంగా ఫొటోలు దిగానని, ఎక్కడా ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని మరిసా చెప్పింది. తమకు ఈజిప్టు ఆచారాలు, సంప్రదాయాలు తెలుసని, అయితే ఏకాంతంగా నగ్నంగా ఫోటోలు తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలియదని అమ్మడు వాపోయింది.