Moderate Rains For Next 3 Days, Imd Issues Red Alert To Central Districts in Telangana
mictv telugu

మరో 3 రోజులూ వానలే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

July 11, 2022

Moderate Rains For Next 3 Days,  Imd Issues Red Alert To Central Districts in Telangana

తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పలు నగరాలు తడిసి ముద్దయ్యాయి. చెరువులు, కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన‌ రక్ష‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గోదావ‌రి, ఉప న‌దుల్లో వ‌ర‌ద ప‌రిస్థితిపై ఆరా తీశారు. అవ‌స‌ర‌మైన చోట తీసుకోవాల్సిన త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సీఎం ఆదేశించారు.