మోదీ మీద డిగ్గీరాజా వెటకారపు ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ మీద డిగ్గీరాజా వెటకారపు ట్వీట్

September 8, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత డిగ్గీరాజా ఏకంగా ఇప్పుడు ప్రధాని మోదీనే టార్గెట్ చేసాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా నరేంద్ర మోదీని చాలా వెటకారంగా ట్వీట్ చేస్తూ ఫోటో పెట్టాడు. ఇప్పడా ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ తన ట్వీట్ లో ఏమున్నదంటే ప్రధాని మోదీ రెండు ఘనకార్యాలు సాధించినట్టు ఒక ఫోటో వుంటుంది. అందులో ఒకటి భక్తులను పిచ్చోళ్ళను చేసినట్టు, రెండోది పిచ్చోళ్ళను భక్తులను చేసినట్టు వ్యాఖ్యలున్నాయి. ఇది ఫార్వర్డ్ పోస్టే అయినా తను దీన్ని పోస్ట్ చెయ్యకుండా వుండలేనని కూడా వివరణిచ్చాడు. పైగా ఇందులోని వ్యక్తికి క్షమాపణలు అని పేర్కొంటూనే ప్రజలను వెర్రోళ్ళను చేయడంలో ఈయనను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరన్నట్టు దిగ్విజయ్ మరో కామెంట్లో రాసాడు.