మోదీకి గది ఇవ్వని లలితా మహల్.. మరో హోటల్‌కు వెళ్లిన ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి గది ఇవ్వని లలితా మహల్.. మరో హోటల్‌కు వెళ్లిన ప్రధాని

February 19, 2018

అతిథి దేవో భవ అని సూక్తి. అతిథులను దేవుడిలా గౌరవించి, చక్కగా చూసుకోవడం మన సంప్రదాయం. దీన్ని నరనరానా ఒంటబట్టించుకుంది మైసూరులోని ప్రఖ్యాత లలిత మహల్ ప్యాలస్. తమ హాటల్లో బుక్ చేసిన అతిథుల కోసం ఏకంగా ప్రధాని మోదీకే ఝలక్ ఇచ్చింది. ఆయన బస చేయడానికి వద్ద గదులు ఖాళీగా లేవని, కావాలంటే ఖాళీగా ఉన్నప్పుడు రావాలని తేల్చిచెప్పింది.ఈ విషయాన్ని హోటల్ జనరల్ మేనేజర్ జోసఫ్ మత్తియాస్ సొమవారం మీడియాకు వెల్లడించారు. ప్రధాని మోదీ శ్రావణబెళగొళలో జరుగుతున్న గోమఠేశ్వరుని మహామస్తాకాభిషేకానికి హాజరయ్యేందుకు ఆదివారం మైసూరు వచ్చారు. ఆయన రాకకు ముందు.. రాజవిలాసాలు ఉన్న ఖరీదైన లలితా మహల్ హోటల్‌ను బుక్ చేయాలనుకునుకుంది కేంద్ర సర్కారు. మోదీకి, ఆయన సిబ్బందికి గదులు ఇవ్వాలని కోరింది. అయితే అప్పటికే ఓ పెళ్లి కోసం హోటల్ గదులన్నింటి వేరేవాళ్లు బుక్ చేసుకుని ఉన్నారు. దీంతో హోటల్ సున్నితంగా కేంద్ర సర్కారు వినతిని తోసిపుచ్చింది. మోదీ అంటే తమకు గౌరవమని, అయితే ఆయన కోసం వేరేవాళ్లను ఖాళీ చేయించలేమని పేర్కొంది.దీంతో అధికారులు మోదీ బస కోసం రాడిసన్ బ్లా అనే హోటల్‌ను బుక్ చేసుకున్నారు. మోదీ అక్కడే బస చేశారు.