అద్వానీని నిండుసభలో అవమానించిన మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

అద్వానీని నిండుసభలో అవమానించిన మోదీ

March 10, 2018

బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం ప్రాధాన్యమివ్వడం లేదన్న సంగతి పాతదే. ప్రాధాన్య సంగతి పక్కనబెడితే కనీస గౌరవం కూడా ఆ సీనియర్ నేతకు మోదీ ఇవ్వడం లేదని తాజా వీడియో ఒకటి చెబుతోంది. ఒక కార్యక్రమంలో అందరికీ ప్రతి నమస్కారాలు చేస్తూ వెళ్లిన మోదీ.. తనకు నమస్కరిస్తున్న అద్వానీకి నమస్కరించకుండా, అసలు ఆయనను ఏమాత్రం లెక్కచేయకుండా పోతున్నట్టుందీ వీడియోలో.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
త్రిపుర రాజధాని అగర్తలో శుక్రవారం కొత్త సీఎంగా బీజేపీ నేత విప్లవ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో ఈ ఉదంతం జరిగింది. కార్యక్రమానికి మోదీ, అద్వానీ, మురళీమనోహర్ జోషి, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితర కాషాయదళ నేతలు హాజరయ్యారు. మోదీ వేదిక మీదికి వస్తుండగా అందరూ ఆయనకు నమస్కరించారు. అమిత్ షా, రాజ్‌నాథ్ తదతరులకు ప్రతినమస్కారాలు చేసిన మోదీ.. అద్వానీ నమస్కారానికి బదులివ్వలేదు. కనీసం ఆయనవైపు కన్నెత్తికూడా చూడలేదు. అయితే అద్వానీ పక్కనే ఉన్న సీపీఎం నేత, తాజీ మాజీ సీఎం మాణిక్ సర్కాను మోదీ పలకరించి చాలాసేపు మాట్లాడారు. మోదీ అమర్యాదకర తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఒక పెద్దమనిషి, చేతులు జోడించి నిలుచుని ఉంటే కన్నెత్తికూడా చూడకపోవడం మోదీ అహంకారానికి తాజా నిదర్శనం..మొన్నటి వరకు మాణిక్ ను తిట్టిపోయిన మోదీకి ఇప్పుడు ఆయన అంత తియ్యగా కనిపిస్తున్నారా?’ అని అంటున్నారు. అద్వానీ ఉనికినే మోదీ జీర్ణించుకోలేకుండా ఉండిపోయారంటున్నారు. మరికొందరైతే అద్వానీనే విమర్శిస్తున్నారు. అలాంటి చిన్న కార్యక్రమానికి ఆయన అనవసరంగా వెళ్లి అవమానాన్ని కొని తెచ్చుకున్నారని పేర్కొంటున్నారు.