తెలంగాణకు మోదీ, అమిత్‌ షా రాక..ఈసారి ఏకంగా మూడు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు మోదీ, అమిత్‌ షా రాక..ఈసారి ఏకంగా మూడు..

June 1, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరికొద్ది రోజులలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈసారి ఏకంగా మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. ఇందుకోసం తెలంగాణలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్ల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జులై మూడో వారం (15వ తేదీ) తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించబోతుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. 300 నుంచి 500 మంది వరకు బీజేపీ సీనియర్లు ఈ సమావేశాలకు హాజరవుతారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

మరోపక్క బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఎల్‌. సంతోష్‌ బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. మూడు రోజల పాటు జరగబోయే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కనుందని ప్రజలు, యువత, పలు పార్టీల నాయకులు తెగ చర్చించుకుంటున్నారు.