విదేశాలకు వెళితే మోదీ బస అక్కడే చేస్తారట - MicTv.in - Telugu News
mictv telugu

విదేశాలకు వెళితే మోదీ బస అక్కడే చేస్తారట

November 28, 2019

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై ఎప్పుడూ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రతి చిన్నదానికి విదేశాలకు వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతూనే ఉన్నారు. గత మూడేళ్లలో  గత మూడేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.255 కోట్లు అని ఇటీవల కేంద్రమంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. ప్రజలు పేదరికంతో ఇబ్బంది పడుతుంటే.. ప్రధాని మాత్రం విలాసాల కోసం ఇంతగా ఖర్చు చేేయడం దేనికని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Modi Avoid Hotels.

ప్రధాని విదేశీ పర్యటనపై తాజాగా కేంద్ర హోం మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రధానుల కంటే ప్రధాని మోదీ వీలైనంత వరకు విదేశీ పర్యటన ఖర్చులను తగ్గించడానికే ప్రధాని చూస్తారని అమిత్ షా తెలిపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు విలాసవంతమైన హోటళ్లలో బస చేయకుండా.. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లోనే గడుపుతున్నారని చెప్పారు.ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఏనాడు ఎస్పీజీని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.  

విదేశాలకు వెళ్లినప్పుడు 20 శాతం కంటే తక్కువ మంది సిబ్బందిని తీసుకుంటారన్నారు. గతంలో అధికారులు ప్రత్యేక కార్లను ఉపయోగించేవారని కానీ వారంతా ఇప్పుడు బస్సులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ లెక్కన గతం కంటే ఇప్పటి ప్రధాని మోదీ ఖర్చు తక్కువే అని అమిత్ షా స్పష్టం చేశారు.