మోదీని వేలెత్తి చూపితే నరికేస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీని వేలెత్తి చూపితే నరికేస్తాం

November 21, 2017

ప్రధాని నరేంద్ర మోదీని చూసి దేశ ప్రజలందరూ గర్వపడాలని, ఆయన పేదల బిడ్డ అని బిహార్ బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ చెప్పారు. మోదీని తప్పుబడుతూ ఎవరైనా వేలెత్తి చూపితే ఆ వేళ్లను, చేతులను నరికేస్తామని హెచ్చరించారు. సోమవారం పట్నాలో ఓ కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘మోదీని విమర్శిస్తూ చూపే వేలిని, చేయిని నరికేయాలి’ అని ఆయన హావభావాలతో బీజీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఈ  వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విమర్శలు సాధారణమేనని, మోదీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించారని, ఆప్పుడు ఎవరూ ఆయన వేలిని ఎవరూ నరకలేదని బిహార్ విపక్షమై కాంగ్రెస్ నేతలు అన్నారు.కాగా, రాయ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘జాతివిద్రోహులు మాత్రమే నా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారు.. మోదీ పేదల పాలిట దేవుడు.. మోదీ.. అవినీతిని, పేదరికాన్ని, నల్లధనాన్ని నిర్మూలించాడు.. ’ అని చెప్పుకొచ్చారు.