ఎన్టీఆర్ వల్లే మోదీ పైకొచ్చాడు.. చంద్రబాబు ఉవాచ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ వల్లే మోదీ పైకొచ్చాడు.. చంద్రబాబు ఉవాచ

March 20, 2018

పొరపాటున పెట్టిన హెడ్డింగు కాదు. చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు పెట్టిన హెడ్డింగు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అంత గొప్పస్థాయికి ఎదగడానికి ఎన్టీఆర్ చలవే కారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాక్రుచ్చారు. ఆయన మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబు గతాన్ని లోతుగా తవ్వారు. ‘ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తులను ఎన్టీఆర్ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆయన కృషి ఫలితంగానే మోదీ ప్రస్తుతం కాంగ్రెస్‌ దీటైన నాయకుడిగా ఎదిగారు’ అని పేర్కొన్నారు. దేశ రాజకీయాలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాష్ట్ర విభజనపై మాట్లుడుతూ.. ‘అప్పట్లో కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ బలోపేతంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చితేనే ఎన్డీఏ పటిష్టం అవుతుందని ఆ కూటమి సర్కారుకు చెప్పారు. కానీ మోదీ లాంటి నాయకుడు అధికారంలోకి వస్తాడని ఆనాడు ఎవరూ ఎవరూ ఊహించలేదు. మమ్మల్ని మోసం చేసింది.. ’ అని మండిపడ్డారు.