మోదీ తిండి ఖర్చు రోజుకు రూ. 4 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ తిండి ఖర్చు రోజుకు రూ. 4 లక్షలు

December 12, 2017

నిరాడంబరంగా ఉండాలని మన ప్రధాని నరేంద్రమోదీ తరచూ చెబుతూ ఉంటారు. తను అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, చాయ్ అమ్మానని చెబుతుంటారన్న సంగతం చాలాపాతదే. అలాంటి ప్రధానిపై గుజరాత్ కాంగ్రెస్ యువనేత అల్వేశ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేరవారు.పఠాన్‌ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం బరిలోకి దిగిన అల్పేశ్‌ ఠాకూర్‌.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. మోదీ తిండి ఖర్చులపై విమర్శలు గుప్పించారు. ‘మోదీగారు తినేది మామూల తిండికాదు.. ఆయన తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకునే పుట్టగొడుగులు తింటారు. ఒక్కో పుట్టగొడుకు రూ.80 వేలు. మోదీ రోజూ అలాంటి వాటిని ఐదు తింటారు. అంటే రోజుకు రూ.4లక్షలన్నమాట! ఇక ప్రధానమంత్రే అంత తింటుంటే.. సాధారణ బీజేపీ కార్యకర్తలు ఏమేం తింటారో చెప్పక్కర్లేదు..’ అని పేర్కొన్నారు.

మోదీ శరీరం రంగుపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అల్పేశ్. ప్రధాని ఒకప్పుడు తనలా నల్లగా ఉండేవారని, అయితే ఇప్పుడు.. రోజూ అంత ఖరీదైన పుట్టగొడుగులు తింటుండడం వల్లే  టమాటా పండులా నిగనినిగ మెరిసిపోతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అల్పేశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే మోదీ ఖరీదైన పుట్టగొడుగులు తింటారని ఇదివరకు కూడా వార్తలు వచ్చాయి. ఆయన కేజీ రూ. 30వేల ఖరీదైన విదేశీ పుట్టగొడుగులు తీసుకుంటారని రెండేళ్ల కిందటే వార్తలు గుప్పుమన్నాయి.