రంగంలోకి మోదీ.. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

రంగంలోకి మోదీ.. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు

March 1, 2022

mm,mm

ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య గత ఆరు రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో సామాన్యులు, చిన్న పిల్లలు బలి అవుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరుగుతున్న దాడులలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థి నవీన్ మృతి చెందాడు. దీంతో ప్రధాని మోదీ నవీన్ శేఖరప్ప కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు.

భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. దీంతో స్పందించిన ప్రధాని మోదీ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ దేశానికి యుద్ద విమానాలను పంపించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశానికి మోదీ సహాయం చేయాలని కోరిన విషయం తెలిసిందే.

ఇందుకోసం ఇప్పటికే ‘ఆపరేషన్ గంగా 2022’ అనే పేరుతో భారత ప్రభుత్వం మిషన్ చేపట్టింది. దీని ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన దాదాపు ఇరవై వేల భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది.

మరోపక్క ఈ మిషన్ కోసం కేంద్రమంత్రులు హర్ధీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, జనరల్ వీకే సింగ్‌లు పూర్తిస్థాయిలో శ్రమిస్తుండగా.. తాజాగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, ఉక్రెయిన్ యుద్ధ విమానాలను పంపిస్తున్నారు.