ప్రపంచంలో తిరుగులేని నేత ప్రధాని మోడి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలో తిరుగులేని నేత ప్రధాని మోడి

November 25, 2022

తిరుగులేని నేతగా ప్రధాని మోడి మరోసారి నిలిచారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో మొదటి స్థానం సంపాదించుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో 77 శాతం రేటింగ్‌తో అందరి కన్నా మోడీ ముందున్నారు. ఆయన తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని(56 శాతం), మూడో స్థానంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్(41 శాతం), నాల్గవ స్థానంలో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో (38 శాతం ) ఉన్నారు. ఇటీవల బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ 36 శాతం రేటింగ్‌తో ఐదవ స్థానంలో నిలిచారు.

ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోదీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. తాజా సర్వేలో మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరిగింది.