ఇవాంకాకు మోదీ ప్రత్యేక బహుమతి - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాకు మోదీ ప్రత్యేక బహుమతి

November 28, 2017

ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు అమెరికా నుంచి  వచ్చిన ట్రంప్ గారాలా బిడ్డె ఇవాంకాకు , ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. సూరత్‌ కళ సడేలీ హస్తకళతో కూడిన ఓ చెక్క పెట్టెను ఇవాంకాకు బహుకరించారు. వివిధ ఆకృతులతో కూడిన అల్లికలు ఈపెట్టెపై ఉన్నాయి.

మోదీ ఇచ్చిన ఈ బహుమతి పట్ల ఇవాంకా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మోదీకీ కృతజ్ఞతలు చెప్పింది. ఇవాంకా కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. అందులో చార్మినార్‌ మెమొంటో, అలాగే హైదరాబాద్ స్వర్ణకారులు రూపొందించిన బంగారు నగలు మరియు గద్వాల సిరిసిల్లలో ప్రత్యేకంగా తయారు చేయించిన  చేనేత చీరలను  ఇవాంకాకు  బహుమతిగా ఇవ్వనున్నారు.