NRCపై మోదీ సర్కార్ కీలక ప్రకటన   - MicTv.in - Telugu News
mictv telugu

NRCపై మోదీ సర్కార్ కీలక ప్రకటన  

February 4, 2020

hv

దేశవ్యాప్తంగా సీఏఏ,ఎన్ఆర్సీపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. కేంద్రం ఎన్ఆర్సీసీని అమలుచేయబోతోందని విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంత వరకు ఎన్ఆర్సీ అమలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఆందోళనకారులు తమ నిరసనలకు స్వస్తి చెప్పాలని సూచించింది.లోక్‌సభలో విపక్షాలు కూడా ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్నాయి. ప్రజలకు దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ సభ్యులు నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలోనే సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖలిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. దేశంలో ఎన్ఆర్సీ అమలుపై ఎటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం చర్చించలేదని వెల్లడించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీనిపై ఎటువంటి చర్చ జరగలేదని పేర్కొంది. కాగా గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఉదహరిస్తూ బీజేపీయేతర పక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బడ్జెట్ సమావేశాల్లోనూ సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.