50 రాష్ట్రాల ఏర్పాటులో మోదీ.. బెంగళూరు పని అయిపోయింది : కర్ణాటక మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

50 రాష్ట్రాల ఏర్పాటులో మోదీ.. బెంగళూరు పని అయిపోయింది : కర్ణాటక మంత్రి

June 23, 2022

దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరగనున్నాయనే సంకేతాలను కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ కత్తి ఇచ్చారు. దేశంలో 50 రాష్ట్రాలను ఏర్పాటే చేసే దిశగా మోదీ ఆలోచిస్తున్నారని వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బెంగళూరు పనైపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే ‘ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రధాని మోదీ కూడా కొత్త రాష్ట్రాలపై చర్చిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా, మహారాష్ట్రను మూడు రాష్ట్రాలుగా, కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజించనున్నారు. దీనికి సంబంధించి చర్చ ఇప్పటికే జరుగుతోంది. బెంగళూరు సిటీ పని అయిపోయింది. నా ఇంటి నుంచి అసెంబ్లీకి దూరం కేవలం పది కిలోమీటర్లే. ఆ మాత్రం దూరం వెళ్లడానికి గంటన్నర సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భవిష్యత్తులో ఐటీ, బీటీ, పరిశ్రమలు భారీగా పెరిగి తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రాల విభజన అంశం మరోసారి చర్చకు వచ్చింది. నిజంగా మోదీ 50 రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే అది మరో సంచలనంగా మారే అవకాశం ఉంది.