మోదీజీ..ఆది నా పావురం, ఇప్పించండి ప్లీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీజీ..ఆది నా పావురం, ఇప్పించండి ప్లీజ్

May 27, 2020

dove

భారత్ పై గూఢచర్యం చేయడానికి పాకిస్తాన్ అప్పుడప్పుడు పావురాల పంపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ పావురం కశ్మీర్ లో కలకలం రేపింది. ఆ పావురంపై గులాబీ రంగు ఉండడం, కాలికి రింగ్ ఉండడం, దానిపై నంబర్ ఉంటడడంతో పోలీసులు దానిని అదుపులోకి తీసుకున్నారు. పావురంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడా పావురానికి సంబంధించి ఆసక్తికర అంశం బయటపడింది.

ఆ పావురానికి, పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అది గూఢచారి పావురం కాదంటూ సరిహద్దులోని పాక్ గ్రామానికి చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. తన పావురం తనకు ఇప్పించాలని కోరుతున్నాడు. ఆ పావురం తనదేనని, పావురం రింగుపై ఉన్న నంబరు తన ఫోన్ నంబరని అతడు చెబుతున్నాడు. తన పావురాన్ని తనకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు.