Modi launched floating solar power project Telangana Ramagundam
mictv telugu

తెలంగాణ: అతిపెద్ద తేలాడే సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభం

July 30, 2022

Modi launched floating solar power project Telangana Ramagundam

భారీ బడ్జెట్‌తో భారీ పరికరాలతో, సువిశాల స్థలంలో ఏర్పాటైన దేశంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టును దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. తెలంగాణ‌లోని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిజిల్లా రామగుండంలో రూ. 423 కోట్ల వ్యయంతో, 100 మెగావాట్ల సామర్థ్యంతో, ఎన్టీపీపీ జలాశయంలోని దీన్ని నిర్మించారు. మోదీ ఢిల్లీ నుంచి ఈ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

మేక్ ఇన్ ఇండియా పథకం కింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా చేస్తారు. దీని వల్ల ఎన్టీపీసీకి ఏటా 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా కానుంది. అంతేకాకుండా 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల ముప్పు తప్పుతుంది. ప్రాజెక్టు ప్రారంభానికి ముందుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాజెక్టు ఫొటోలు, వివరాలు ట్విటర్లో పంచుకున్నారు. మోదీ శనివారం దేశవ్యాప్తంగా రూ. 5200 కోట్లతో నిర్మించిన పలు విద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు.