మోదీ, మల్యాల పీడ పోవాలని చిలుకూరు గుడిలో పూజలు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ, మల్యాల పీడ పోవాలని చిలుకూరు గుడిలో పూజలు

February 19, 2018

వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తీరుపై, వారిని శిక్షించడంలో సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా తీవ్రనిరసనలు వ్యక్తమవుతున్నారు. ఇలాంటి వైట్ కాలర్ దోపిడీదొంగల బారి నుంచి దేశాన్ని కాపాడాలని చిలుకూరులోని ప్రఖ్యాత బాలాజీ దేవాలంలో రుణ విమోచన పూజలు చేశారు.ప్రధానార్చకుడు రంగరాజన్  ఆధ్వర్యంలో భక్తులు ఈ ‘రుణపీడా నివారణ’ పూజలు చేశారు. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడం వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని, వెంకన్న వీరి పనిపట్టాలని భక్తులు కోరారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకుంటున్న డబ్బు భద్రంగా ఉండేలా చూడాలని కోరారు.