Modi MOdi Chants In Kejriwal Road Show
mictv telugu

మొన్న ఓవైసీ…ఇప్పుడు కేజ్రీవాల్

November 21, 2022


గుజరాత్ ప్రచారంలో విపక్ష నేతలకు షాక్ తగులుతోంది. బహిరంగ సభలు, రోడ్ షోలలో బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురవుతోంది. మొన్న ఓవైసీ సభలో మోదీ మోదీ నినాదాలు వినిపిస్తే ఇప్పుడు కేజ్రీవాల్ షోకు అడ్డుతగిలారు. మోదీ మోదీ అంటూ నినాదానాలు చేశారు. వాళ్లకు నచ్చిన నేతకు జై కొట్టనివ్వాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో ఎందుకిలా జరుగుతోంది. విపక్ష సభలు, ర్యాలీలలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి కారణాలేంటి?

కేజ్రీవాల్‌కు షాక్

గుజరాత్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార, విపక్షాలు సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. ఆదివారం గుజరాత్‌లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పంచ్మహాల్ జిల్లాలోని హలోల్‌లో రోడ్ షా నిర్వహించారు. ప్రజల్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోదీ..మోదీ…అంటూ నినాదాలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. వాళ్లకు నచ్చిన నేతలకుజై కొట్టనివ్వాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సూచించారు. భవిష్యత్ లో ఒకరోజు మీ మనసులు గెలుచుకుంటాం, మిమ్ముల్ని పార్టీలో చేర్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. “కొంతమంది ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కానీ వారి పిల్లలకు స్కూళ్లు నిర్మించి ఇచ్చేది మాత్రం ఈ కేజ్రీవాలే.ఎవరికి జై కొట్టినా మీకు ఉచిత విద్యుత్ ఇచ్చేది ఈ కేజ్రీవాలే. మీకు నచ్చిన నేతకు జై కొట్టండి. ఏదోఒకరోజు మీ మనస్సులు గెలుచుకుంటా. ఇప్పడు మోదీ అన్నట్లుగానే భవిష్యత్ లో కేజ్రీవాల్ అని పిలిపించుకుంటా” అని అన్నారు. 27ఏళ్లపాటు బీజేపీకి అధికారం ఇఛ్చారు…ఇప్పుడు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కేజ్రీవాల్ అభ్యర్థించారు.

అంతకుముందు ఓవైసీ

గతవారం ఎంఐఎం అధినేత ఓవైసీని గుజరాత్ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన సభలో మోదీ మోదీ అని ఇవే నినాదాలు వినిపించాయి. గుజరాత్‌లో డిసెంబర్ 1.5న రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అదే నెల8న కౌంటింగ్ ఉంటుంది. ఏడోసారి గెలుపుకోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలాగైనా బీజేపీకి అడ్డుకట్టవేయాలని కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా పోటీ చేస్తుంది. ఆప్ రాకతో తీన్ మార్ వార్ నడుస్తోంది.