మోదీ మోదీ ఎస్ పాపా.. వైరల్ అవుతున్న రైమ్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ మోదీ ఎస్ పాపా.. వైరల్ అవుతున్న రైమ్

May 8, 2019

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హవా నడుస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ఒకర్ని ఒకరు విమర్శించుకోవడంలో కొత్త కోణాలను ఎంచుకుంటున్నారు. విమర్శల్లో క్రియేటివిటీని జోడిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనపై ఆర్జేడీ వ్యంగ్యంగా ఓ రైమ్‌ను రచించింది. ఇప్పుడు ఈ రైమ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎల్‌కేజీ, యూకేజీ చదువుకునే విద్యార్థులు పాడుకునే ‘జానీ.. జానీ ఎస్‌పాపా’ అనే ఐకానిక్ నర్సరీ రైమ్ అందరూ చదువుకునే ఉంటారు. దాన్ని కాపీ కొట్టి రైమ్ మార్చి రాశారు.

మోదీ, మోదీ పాలనా తీరును ఎండగడుతూ చాలా సెటైరికల్‌గా రాశారు రైమ్.  ‘మోదీ మోదీ ఎస్‌ పాపా.. ఎనీ డెవ్జ‌లప్‌మెంట్ నో పాపా.. ఫార్మర్‌ హ్యాపీ నో పాపా.. ఉమెన్‌ సేఫ్టీ నో పాపా..’ అని పదాలు అల్లారు. ఐదేళ్ల బీజేపీ పాలనను ఎండగడుతూ ఈ రైమ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిని ఆర్జేడీ పార్టీ అధికార ట్విటర్‌​ ఖాతాలో బుధవారం పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. 40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌లో విజయం కోసం ఓ వైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి హోరాహోరీగా  పోటీపడుతున్నాయి.