మోడీ మార్క్ రాజకీయం @ బీహార్ !
మహా కూటమిని బద్దలు కొట్టారు. బిజెపి అనుకున్నది సాధించింది. రెండేండ్ల లాలూ, నితీష్ ల స్నేహాన్ని విడగొట్టగలిగింది. 2014 ఎన్నికల్లో తన ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్ నే ఇప్పుడు బుట్టలో వేసుకోవడంతో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చనేది తేలిపోయింది. బీహార్లో రాజకీయం ఇప్పుడు దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ! 2019 లో తనను ఢీకొట్టడానికి రెడీ అవుతున్న బీహార్ మహాకూటమిని చీల్చి షాకిచ్చారు.
అయితే ఆర్ జెడి, కాంగ్రెస్ లకు ఇది కోలుకోలేని షాక్ అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా !? భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని మహాకూటమిని చెయ్యాలనుకున్న కాంగ్రెస్ ప్లాన్ ను కొంత మే బ్రేక్ పడ్డట్టే. లాలూపై జరుగుతున్న సిబిఐ దాడులను సాకుగా చూపి నితీష్ కాషాయపు గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో ఒకింత ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. నితీష్ కు గత్యంతరం లేనట్టు బిజెపీకి షేక్ హ్యాండ్ ఇవ్వక తప్పని పరిస్థితి అన్నట్టు క్రియేట్ చేస్కొని జంపు చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏదేమైనా బీహార్ రాజకీయాలు అనుకోని మలుపు తిరిగాయి. ఆ మలుపును బిజెపీ తనకు పాజిటివ్ గా మారల్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు.