బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు కరోనా టీకాను ఉచితంగా వేస్తామని బీజేపీ హామీ ఇవ్వడంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ లేదా? అక్కడి ప్రజలు టీకాలు లేకుండా చచ్చిపోవాలా? అని విపక్షాలు మండిపడుతున్నాచయి. దీంతో బీజేపీ తప్పు దిద్దుకుంటోంది. టీకా మనదేశంలో అందుబాటులోకి రానే అందరికీ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
‘దేశంలో ఒక్కరిని కూడా విడిచిపెట్టకండా అందరికీ కరోనా టీకా అందిస్తాం. ఏం ఎవర్నీ మరచిపోం. మొదట కరోనా వారియర్లకు వేస్తాం. టీకా పంపిణీ కోసం కేంద్రం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు ప్రణాళికలు తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా 28 వేల టీకా కోల్డ్ చైన్ పాయింట్లను సిద్ధం చేస్తాం. టీకా పంపిణీ పారదర్శకంగా సాగుతుంది..’ అని మోదీ ఓ జాతీయ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు పెరగడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రధాని వాపోయారు. ఒకసారిలో కేరళలో, మరోసారి గుజరాత్, ఇంకోసారి కర్ణాటకల్లో కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంచాలని సలహా ఇచ్చారు.