పరిమిత కుటుంబం కూడా దేశభక్తే.. మోదీ
దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో పేదరికం, అధిక జనాభా ముందు వరసలో ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పంద్రాగస్టు ప్రసంగంలో అధిక జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిడ్డను కనేముందుకు ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. దేశ ప్రధాని ఒకరు పంద్రాగస్టు ప్రసంగంలో అధిక జనాభా గురించి మాట్లాడడం ఇదేనని భావిస్తున్నారు.
మోదీ ఏమన్నారంటే..
విపరీతంగా పెరుగుతున్న జనాభా వల్ల భావి తరాలు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్త చేశారు. ‘బిడ్డ పుట్టక ముందే ఆలోచించండి. చదువుకున్న వాళ్లు అలా ఆలోచిస్తున్నారు. అలాంటి వారు మన దేశంలో ఉన్నారు. తమ కుటుంబాలను పరిమితం చేసుకుంటారు. పుట్టబోయే బిడ్డలకు నేను న్యాయం చేయగలనా రావాలి. పరిమిత కుటుంబం వల్ల పిల్లలకు అన్ని సౌకర్యాలను అందించగలం. ఇది మంచి విధానం మాత్రమే కాదు, ఇది కూడా ఒక విధంగా దేశభక్తే..’ అని పేర్కొన్నారు. జనాభా విస్ఫోటంపై దేశంలో చర్చ జరగాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అరికట్టడానికి పథకాలు తేవాలని కోరారు.