పుతిన్‌కు మోదీ ఫోన్.. 6గంటల వరకే డైడ్‌లైన్ - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్‌కు మోదీ ఫోన్.. 6గంటల వరకే డైడ్‌లైన్

March 5, 2022

05

రష్యా అధ్యక్షుడికీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని పుతిన్‌ని మోదీ కోరారు. ఇందుకు స్పందించిన పుతిన్.. ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపాడు. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్‌లైన్ విధించింది. అంతేకాకుండా ఈలోగా తక్షణమే ఖార్కివ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ.. భారతీయులను అప్రమత్తం చేసింది.

 

ఆరు గంటల పాటు సేఫ్ ప్యాసేజిని కల్పించిన రష్యా ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌ను చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని రష్యా పేర్కొంది.

మరోపక్క ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఆ విషయం తనకు అర్ధమైందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్ పుతిన్‌తో అన్నారు. ఇద్దరు దాదాపు 90 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇక తదుపరి యుద్ధం కొనసాగించలా లేదా అనే విషయంపై రెండు దేశాల అధికారులు సమావేశం అయ్యారు. చర్చలు జరుగుతున్నాయి.