మోదీ ఫోటో ఎఫెక్ట్.. పోలీసులకు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఫోటో ఎఫెక్ట్.. పోలీసులకు ఫిర్యాదు

March 30, 2022

vvvvv

ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకున్నందుకు ఓ వ్యక్తి బెదిరింపులకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇండోర్ నగరంలోని పీర్‌గలిలో నివాసం ఉండే యూసుఫ్ ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. నరేంద్రమోదీ మీద అభిమానంతో ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు మోదీ ఫోటో తీసెయ్యాలని యాకూబ్ మన్సూరి, సుల్తాన్ మన్సూరీలు ఒత్తిడి చేశారు. అంతేకాక, ఇంట్లోంచి గెంటేస్తామని బెదిరించారు. దీంతో యూసుఫ్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కమిషనర్ డీసీపీ మనీషా పాఠక్‌ను తన టీంతో దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించారు. వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.