Modi property value
mictv telugu

భారీగా పెరిగిన మోదీ ఆస్తులు.. ఇదీ చిట్టా..

August 9, 2022

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఏడాది వ్యవధిలో భారీగా పెరిగాయి. రూ. 26 లక్షలు పెరిగి రూ. 2.23 కోట్లుకు చేరుకున్నాయి. అయితే ఇవన్నీ చరాస్తులేనట. ఆయనకు సొంత కారు కూడా లేదట. ఈ వివరాలను ప్రధాని స్వయంగా వెల్లడించారు. మోదీ తెలిపిన వివరాల ప్రకారం..
మోదీ ఆస్తిలో అత్యధికం బ్యాంకు డిపాజిట్లే. గాంధీనగర్‌లోని కోటి రూపాయల విలువైన తన భూమిని విరాళంగా ఇచ్చేశారు. రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు మోదీ దగ్గర ఉన్నాయి. 2021 మార్చి 31 నాటికి ఆయన ఆస్తుల విలువ రూ. 1.97 కోట్లు. 2022, మార్చి 31 నాటికి ఆయన దగ్గర రూ.2,23,82,504 సొమ్ము ఉంది. చేతిలో రూ.35,350 నగదు, పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్ రూపంలో రూ.9,05,105 ఉండగా, జీవిత బీమా రూ.1,89,305 విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్‌, జోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, పర్శోత్తమ్‌ రూపాలా, జీ కిషన్‌ రెడ్డి, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలు తదితరుల కూడా ఆస్తులు వెల్లడించారు. చాలామంది ఐదు కోట్ల లోపు ఆస్తులే చెప్పుకొచ్చారు.