మోదీ రావొద్దంటూ.. యువకుడి ఆహుతి - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ రావొద్దంటూ.. యువకుడి ఆహుతి

April 12, 2018

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనపై తీవ్ర నిరసనలు వెళ్లువెత్తున్నాయి. ఆందోళనల నుంచి ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల వరకు తమిళ ప్రజలు అన్నిరూపాల్లో వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. కావేరీ జల బోర్డు ఏర్పాటు డిమాండుతో రాష్ట్రం అట్టుడుకున్న నేపథ్యంలో మోదీ పర్యటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం చెన్నైవచ్చారు.

కావేరి అంశంపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈరోడ్‌కు చెందిన ధర్మలింగం అనే యువకుడు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. చనిపోయే ముందు అందుకు కారణాలను తన ఇంటి గోడపై రాశాడు. తీవ్రంగా గామపడిన ధర్మలింగం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రధాని చెన్నై విమానాశ్రయానికి రాగానే నిరసనతో స్వాగతం లభించింది. నియంత డౌన్డౌన్ అని ఆందోళనకారులు నినదించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.