మోడీ పబ్లిసిటీ కాస్ట్‌లీ గురూ! - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ పబ్లిసిటీ కాస్ట్‌లీ గురూ!

December 9, 2017

ప్రధానమంత్రి మోడీ చేతికి ఎముక లేదు. అడిగినా, అడగకున్నా కాదనకుండా పైసలు ఇచ్చిండు. ఇన్ని రోజులు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే చూసిన ఆశాఖ కలలో కూడా ఊహించనన్ని పైసలను కేటాయించిండు. ఖర్చు చేయించిండు. ఇదంతా చదివి గ్రామీణాభివృద్ధి కోసమో, లేదంటే పేద ప్రజల విద్య, ఆరోగ్యం కోసమో మోడీ పైసలు ఇచ్చిండు అనుకునేరు.

మోడీప్రభుత్వం ఖర్చు చేసిన ఆ పైసలతోని కామన్ మ్యాన్ కు వీసమెత్తు ఫాయిదా కూడా కాలేదు. ఎందుకంటే పబ్లిసిటీ కోసమే ఆ పైసలను మోడీ సర్కార్ ఉపయోగించుకుంది. ఎంతనుకున్నారా? తక్కువే. సింపుల్‌గా 37,54,06,23,616  కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ఈ మూడేళ్లలో మోడీ సర్కార్ ఖర్చు చేసింది. 2014 ఏప్రిల్ నుంచి 2017 అక్టోబర్ వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 3 వేల 7వందల 55 కోట్ల రూపాయలను వాడుకుందని RTI తో తెలిసింది. గ్రేటర్ నోయిడాలో ఉండే సామాజిక కార్యకర్త రాంవీర్ తన్వర్ ఈ RTI‌ను  ఫైల్ చేసిండు.  

 

పబ్లిసిటీ కోసమే మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన మోడీ సర్కార్, ప్రజలకు ఉపయోగించే పనులకు ఎంత బడ్జెట్ కేటాయించిందో తెలుసుకుంటే షాక్ అవుతారు. ఢిల్లీతో పాటు చాలా నగరాలు కాలుష్యం బారిన పడి ఆగమాగం అవుతుంటే ఈ మూడేళ్లలో అందుకోసం ఖర్చు చేసింది కేవలం 56 కోట్లు.

పబ్లిసిటీ కోసం మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు నిధులు కేటాయించకుండా సొంత ఆడంబరాల కోసం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఎందుకు అంటున్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత తీసుకున్న అప్పుకు వడ్డీ మాఫ్ చేస్తేనే గొంతు చించుకునే సోకాల్డ్ టాక్స్ పేయర్స్  ఈ కాస్ట్లీ పబ్లిసిటీ పై కూడా మాట్లాడాలి.