రాహుల్ హిందువు..మోదీ హిందువు.. నేను మాత్రమే మతపిచ్చోణ్ని! - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ హిందువు..మోదీ హిందువు.. నేను మాత్రమే మతపిచ్చోణ్ని!

November 30, 2017

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సోమనాథ్ గుళ్లో చేసినట్లు చెబుతున్న సంతకం పెను దుమారం రేపుతోంది. ఆయన నాన్ హిందూ విజిటర్ల పుస్తకంలో సంతకం చేశాడు కను  క్రైస్తవుడని,  హిందువుల వ్యతిరేకి అని బీజేపీ ఆరోపించింది. అయితే ఆయన క్రైస్తవుడు కాదని, జంధ్యం వేసుకునే స్వచ్ఛమైన  హిందూ బ్రాహ్మణుడని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆ రెండూ అలా కీచులాడుకుంటుండగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా రంగంలోకి దిగాడు.. రాహుల్, మోదీ .. అందరూ హిందువులే నేను మాత్రమే మతవాదిని.. అని గట్టి చురక అంటించాడు.

‘తమ ఉపాధ్యక్షుడు హిందువు, జంధ్యధారి అంటు కాంగ్రెస్ అంటోంది. తమ నేత మోదీ హిందువు, ఓబీసీ అని బీజేపీ అంటోంది.. ఇదంతా ఓల్డ్ బాయిస్ నెట్‌వర్క్ లాంటింది. ఇందులో నాలాంటి వాళ్లకు ప్రవేశం ఉండదు..ఎందుకంటే నేను మాత్రమే మతవాదిని, మిగతా వాళ్లందరూ లౌకిక వాదులు, జాతీయవాదులు కనుక..’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.