నేను మనిషిని.. మోదీని కాను! - MicTv.in - Telugu News
mictv telugu

నేను మనిషిని.. మోదీని కాను!

December 6, 2017

లెక్కలు కూడా రావా అంటూ బీజేపీ నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటు సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై తన తప్పును ఒప్పుకుంటూనే దీటుగా స్పందించారు. నేరుగా మోదీని టార్గెట్ చేసుకుని బుధవారం ట్వీట్ వదిలాడు. ‘నేను ఓ సాధారణ మనిషిని.. నరేంద్ర మోదీని కాదు.. మనుషులు అన్నాక ఇలాంటి పొరపాట్లు చేయడం సహజం.. వాటి వల్ల జీవితం మరింత ఆసక్తికరంగా ఉంటుంది.. నా తప్పులు గుర్తించేలా చేసినందుకు థ్యాంక్స్.. ’ అని ట్వీటాడు.నరేంద్ర మోదీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదలకు సంబంధించిన రాహుల్ కొన్ని తప్పులతో ట్వీట్ చేశారు.  ధరల పెరుగుదల శాతాల్లో పొరపాట్లు జరిగాయి. దీంతో నీకు కనీసం లెక్కలు కూడా రావా అని విమర్శలు వచ్చాయి. రాహుల్ చేసిన తప్పు సంగతి పక్కన పెడితే .. అతడు మోదీకి తిరుగులేని పంచ్ ఇచ్చాడి నెటిజన్లు కితాబిస్తున్నారు.