నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందినట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వాళ్లకు చెరో యాభై వేలు పరిహారాన్ని మంజూరు చేస్తున్నట్లు పీఎంవో ట్వీట్ చేసింది
పవన్ తీవ్ర విచారం
చంద్రబాబు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించడంపై జనసేన అధినేన పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కందూరులో జరిగిన సభ దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని… అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు పవన్. ఆసుపత్రిపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అసలు ఏం జరిగింది..?
చంద్రబాబు ప్రస్తుతం ‘ఇదేం కర్మ’ కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సభలు, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం పర్యటించారు. పట్టణంలోని ఎన్టిఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక టిడిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాబు మాట్లాడటానికి సిద్ధం కాగానే ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. వెనుకనున్న వారు ముందుకు తోసుకురావడానికి ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. చూస్తుండగానే కొందరు గుండమకట్ట కాలువలోకి పడిపోయారు. డ్రైనేజి నీరు ప్రవహిస్తుండటంతో పడినవారందరూ నీట మునిగిపోయారు. కాలువలో పడినవారిని బయటకుతీసి ఆస్పత్రికి తరలించారు. మొదట ఇద్దరే మరణించారని భావించానా..తర్వాత మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదంలో మొత్తం 8 మంది చనిపోయినట్లు తేలింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సభను వెంటనే ఆపేసిన చంద్రబాబు ఆస్పత్రికి వెళ్ళ గాయపడ్డ కార్యకర్తలతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యలను పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు