బంగ్లాదేశ్ ప్రధానికి మోదీ అరుదైన కానుక.. ఏం పంపారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

బంగ్లాదేశ్ ప్రధానికి మోదీ అరుదైన కానుక.. ఏం పంపారంటే..

September 28, 2020

uoyuj

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పుట్టినరోజు సందర్భంగా అరుదైన బహుమతిని పంపించారు. భారత ప్రధాని మోదీ. భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా వెళ్లి ఆమెకు దాన్ని అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ గిఫ్ట్ బాక్సులో హసీనా తండ్రి షేక్ ముజిబూర్ రెహ్మాన్ 1972లో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా తీసిన అరుదైన వీడియోను పొందుపరిచారు. దాన్ని చూసిన ఆమె ఎంతో సంతోషంగా స్వీకరించారు. దీనికి ఆమె మోదీకి కృతజ్ఞత తెలిపారు. 

1971లో పాకిస్థాన్ తో యుద్ధం  తర్వాత ముజిబుర్ రెహ్మాన్ 1972 మార్చిలో భారత పర్యటనకు వచ్చారు. బంగ్లా స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఆయన వచ్చారు. ఆ సమయంలో స్నేహం, సహకారం, శాంతిపై ఇండో బంగ్లా ఒప్పందంపై జరిగింది. అప్పుడు తీసిన అరుదైన వీడియోను బహుకరించారు. ఈ సందర్భంగా మోదీపై ఆమె ప్రశంసలు కురిపించారు. ‘’మీ దూరదృష్టి, నాయకత్వం వల్ల బంగ్లాదేశ్ అపారమైన సామాజిక,ఆర్థిక పరివర్తనను సాధించింది. మా ద్వైపాక్షిక సంబంధాలకు మీ సహకారం ఎంతో ఆకట్టుకుంది’ అని పేర్కొన్నారు.