ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. ఏం చెప్పారంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. ఏం చెప్పారంటే

March 7, 2022

modi

భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోనులో మాట్లాడారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో ఆ దేశం సహకరించడంపై మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న భారత పౌరుల తరలింపుపై కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా తమ దేశంలో నెలకొన్న ప్రస్థుత పరిస్థితుల గురించి జెలెన్ స్కీ మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష చర్చల గురించి మోదీకి తెలియజేశారు. కాగా, చర్చలను స్వాగతించిన మోదీ, దౌత్య మర్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి సూచించారు. వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ దాదాపు 35 నిమిషాల పాటు సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మూడో విడత చర్చలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. గత రెండు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఇప్పుడు జరిగే చర్చల్లోనైనా యుద్ధం అపే దిశగా ఏమైనా చర్యలు ఉంటాయోమో వేచి చూడాలి.