ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహం. - MicTv.in - Telugu News
mictv telugu

ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహం.

September 15, 2021

ఉపయోగించే విధానం తెలుసుండాలే గాని ప్రకృతిలో పనికిరానిదంటూ ఏది ఉండదు, చివరికి స్క్రాప్ కూడా. అలాంటి అద్భుతమైన ఆవిష్కరణ ఒకటి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మనదేశంలో మొట్టమొదటిసారిగా ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారుచేశారు.

తెనాలికి చెందిన సూర్య శిల్పశాల నిర్వహకులు కాటూరి వెంకటేశ్వరరావు,ఆయన కుమారుడు రవిచంద్ర 14 అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో మోదీ విగ్రహాన్నితీర్చిదిద్ధారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఈ విగ్రహాన్ని తయారుచేయించినట్లు చెప్పారు. స్క్రాప్‌తో మనుషుల పోలికలను విగ్రహాల్లో సృష్ఠించడం చాలా కష్టంతో,చాలా సాహసంతో కూడుకున్న పని అని వివరించారు.

మనదేశంలో స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారుచేయడం ఇదే మొదటిసారని, ఇప్పటివరకు ఎవరూ తయారుచేయలేదని శిల్పులు వెల్లడించారు. మూడు నెలల పాటు పది మంది శిల్పకళాకారులచే ఈ విగ్రహాన్ని తీర్చిదిద్ధామని తెలిపారు.ఈ నెల 16న ఈ విగ్రహాన్ని బెంగళూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు.