ఇవ్వాళ ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ… ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు 50 నిమిషాల పాటు సంభాషించారు. ప్రధానంగా ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ జరిగింది. అక్కడి వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగా.. దానికి అదనంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు.
అంతేకాక, సుమీ వంటి నగరాల్లో కాల్పుల విరమణ చేసి, మానవతా కారిడార్ ఏర్పాటు చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి భారతీయుల తరలింపుపై రష్యా సహకారాన్ని మోదీ కోరగా, ఆ మేరకు పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 12వ రోజుకు చేరుకుంది.