మోదీ..నాకు మద్దతు ఇవ్వండి: యశ్వంత్ సిన్హా - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ..నాకు మద్దతు ఇవ్వండి: యశ్వంత్ సిన్హా

June 25, 2022

భారతదేశ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక అవుతారు అనే అంశంపై దేశవ్యాప్తంగా తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది మూర్ము, విపక్షాల తరుపున యశ్వంత్ సిన్హాలు ఎన్నికల బరిలో నిలిచారు. శుక్రవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది మూర్ము నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారట. మోదీతోపాటు అద్వానీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌లకు కూడా ఆయన ఫోన్ చేశారట.

మరోపక్క ముర్ముకు మద్దతు ప్రకటించాలనే యోచనలో సొరేన్ ఉన్నట్టు తెలుస్తోంది. ముర్ము, సొరేన్ ఇద్దరూ సంతాల్ అనే ఒక గిరిజన తెగకు చెందిన వారు. జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాజ్ వాది పార్టీ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలలో జరిగిన సమావేశంలో సిన్హాకు మద్దతివ్వాలని అఖిలేశ్ యాదవ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విషయానికొస్తే.. వైసీపీ ప్రభుత్వం ద్రౌపది మూర్మకు మద్దతు పలుకగా, కేసీఆర్ సర్కార్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు.