modi telagana tour sheduel
mictv telugu

తెలంగాణలో మోడీ టూర్ షెడ్యూల్ ఇదే..

November 12, 2022

modi telagana tour sheduel

తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణలో శనివారం ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నేడు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు మోడీ రానున్నారు. మ.1:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. మ.1.40 నుంచి 2 గంటల వరకు బేగంపేటలో స్వాగత సభ కార్యక్రమం ఉంటుంది. ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, అధికారులు స్వాగతం పలకున్నారు.

మధ్యాహ్నం 2-15 గంటలకు బేగంపేట్ నుంచి రామగుండంకు మోడీ బయలుదేరి 3. 20 నిమిషాలకు చేరుకుంటారు. 3.30 నుంచి 4 గంటల వరకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సందర్శిస్తారు.తదనంతరం ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. తిరిగి 5.30గంటలకు హైదరాబాద్ పయనమవుతారు. 6 గంటల 40 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. ఇక ప్రధాని పర్యటన నేపధ్యంలో బీజేపీ మంచి జోష్‌లో ఉంది. ప్రధాని పర్యటన సక్సెస్ చెయ్యాలని భావిస్తుంది