తెలుగులో దుమ్మురేపిన మోదీ... - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో దుమ్మురేపిన మోదీ…

November 28, 2017

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోటి నుంచి తెలుగు మాటలు జాలువారాయి. బేగంపేట ఎయిర్ పోర్టులో మంగళవారం తనకు బీజేపీ నేతలు ఏర్పాటు స్వాగత కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగు మాటలతో ప్రసంగాన్ని మొదలుపెట్టి ఆకట్టుకున్నారు. ‘సోదర, సోదరీ మణులారా… మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

హైదరాబాద్‌ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్  అంటే నాకు సర్దార్  పటేల్ గుర్తుకు వస్తారు.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో కలిపిన సర్దార్ పటేల్‌కు వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను..  తెలంగాణ విమోచనంలో  అమరులైన వీరులకు జోహార్లు.. హైదరాబాద్  ఒక అద్భుతమైన నగరం.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధికి  కట్టుబడి ఉంది.. ’ అని అన్నారు.. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు  మోదీకి జై మోదీకి జై అంటూ

+కేకలు వేసి హర్షం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా బీజేపీ కార్యక్రమం. షెడ్యూలులో లేకున్నా ఏర్పాటు చేశారు. మోదీ తెలుగులో ఇంతసేపు మాట్లాడడం ఇదే తొలిసారి.