ఏదన్న అంటే గిట్ల… ఏ అట్ల అంటవ్ పైన తదాస్తు దేవతలుంటరు… అట్లే కాగలదు. అని అంటరు గద. మరి మోడీ సార్ ఎందుకీ మాట అన్నరో ఏర్క లేదు కని… అననైతే అన్నరట….శుభం పల్కురా పెండ్లి కొడుకా అంటే… ఏన్కటికి ఎవరో ఏదో అన్నట్లుందీ…..ఈ వీడియోల మోడీ సాబ్ ముచ్చట….
https://www.youtube.com/watch?v=gBg8_OA3YQg
ఇంతకు మోడీ సాబ్ జీఎస్టీ గురించి ఎప్పుడో అన్న మాట ఏందంటే… ఇది ఎన్నటికీ సక్సెస్ కాదు అని. మౌలిక సదుపాయాలు కల్పించకుండా… దాన్ని అమలు చేయడం మంచి కాదని అన్నడట. దాన్కి సంబంధించిన వీడియో ఒక దాన్ని కాంగ్రెస్పార్టీ లీడర్లు బయటకు ఇడ్సి పెట్టిన్రు. ఇప్పుడదని…రాకెట్ కంటే ఎక్వ స్పీడ్ తోని మందిలకు ఉర్కుతున్నది. జీఎస్టీ గూడ అమల్లకొచ్చింది… అందుకే అట్ల ఉర్కుతున్నట్లుంది.
మరి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్ల అన్నడో ఏమో కని… జీఎస్టీ విజయవంతం కాదు అని. దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం అని చెప్తున్న బిజెపి నాయకులు… మౌలిక సదుపాయాలు కల్పించారో లేదో వారే చెప్పాలి. దేశం యావత్తు దీని కోసం ఎదురు చూస్తున్నది.
మోడీ సార్ మీరు చెప్పిందే కరెక్ట్… మేముకూడా అదే అంటున్నం. మీరు బలే అన్నరు పోర్రి అని కాంగ్రెస్ నాయకులు మోడీ సారు ను బాగా మెచ్చుకుంటున్నరట. మరిగ జీఎస్టీ భవిష్యత్తు ఎట్లుంటదో మనకు తెల్వదు. మోడీ నోట పల్కినట్లే అయితదో…జైట్లీ చెప్తున్నట్లు తొల్తతొల్త జెర్రకంత ఇబ్బంది ఉన్నా ముందుల ముందల మస్తుగ ఉంటందో తెల్వదు. లేక పోతే మోడీ నోటి మాటనే నిజమైతో తెల్వదు. జనాలు మల్లో సారి త్యాగాలు చేయక తప్పదనేది పక్కా వాస్తవం లెక్కుందని కొందరు అంటున్నరు.