మోదీకి చేతకాదు, నేనైతే బాగా పరిపాలిస్తా..మాయావతి - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి చేతకాదు, నేనైతే బాగా పరిపాలిస్తా..మాయావతి

May 17, 2019

ఆదివారం దేశంలో చివరి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తదనంతరం ఈ నెల 23న ఫలితాలు వెలుబడనున్నాయి. ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మోదీని తిరిగి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అవసరమైతే రాహుల్‌ను ప్రధానిని చేస్తామని ప్రకటించగా.. కాంగ్రెస్ సైతం తమకు పీఎం పదవి ఇవ్వకపోయినా పర్వాలేదన్న సంకేతాలిచ్చింది. ఒకవేళ దక్షిణాది ప్రధాని అనే అంశం తెరపైకి వస్తే చంద్రబాబు, కేసీఆర్‌ల పేర్లు కూడా విరివిగా వినిపిస్తున్నాయి

'Modi Unfit for Job' In First-ever Pitch for Top Post, Mayawati Says She'll Make a Better Prime Minister.

ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలిసారి ప్రధాని పదవిపై తన మనసులో మాట బయటపెట్టారు. ప్రధానిగా నరేంద్ర మోదీ కన్నా తానే బాగా దేశాన్ని పరిపాలిస్తానని చెప్పుకున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని పదవికి అర్హుడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి విషయంలో మోదీ కన్నా తానే ఉత్తమమని చెప్పారు. ‘బీఎస్పీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఉత్తర్‌ప్రదేశ్ రూపు రేఖలు మారిపోయాయి. లక్నో ఎంతో సుందరంగా మారింది. ఈ పనులన్నింటినీ గమనిస్తే దేశం, ప్రజల సంక్షేమం కోసం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ప్రధాని పదవికి అర్హురాలు. నరేంద్ర మోదీ అనర్హుడు’ అని మాయావతి ప్రకటించారు.