modi vishka tour Confirmed
mictv telugu

విశాఖ మోడీ టూర్ ఖరారు..

November 2, 2022

modi vishka tour Confirmed

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖకు రానున్నారు. ఈ పర్యటనలో 10 వేల 475 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రహదారుల నిర్మాణం, గెయిల్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయానికి ప్రధాని ఈ పర్యటనలోనే శంకుస్థాపన చేస్తారా..? లేదా అన్న దానిపై క్లారిటీ రాలేదు. మరోవైపు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటూ వైసీపీ పట్టబడుతున్న సమయంలో నగరానికి వస్తున్న మోడీ రాజధానిపై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా..? అనే ఆసక్తి నెలకొంది..

నవంబర్ 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రికి ప్రధాని మోదీ విశాఖలోనే బస చేస్తారు. ఈనెల 12న ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని టూర్ ఏర్పాట్లను అధికారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు.