మోదీ ఇన్ని దేశాలు తిరిగారు, ఇంత ఖర్చయింది..  - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఇన్ని దేశాలు తిరిగారు, ఇంత ఖర్చయింది.. 

September 23, 2020

modi

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దౌత్య సంబంధాలు, పెట్టుబడుల కోసం, రక్షణ రంగ ఒప్పందాల కోసం అనేక దేశాలకు వెళ్లారు. తరుచూ విదేశీ పర్యటనలు చేయడంపై విపక్ష పార్టీలు అభ్యంతరం కూడా చెప్పాయి. ఈ తరుణంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయన విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి మురళీధరన్  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

2015 నుంచి ప్రధాని హోదాలో మోదీ 58 దేశాల్లో పర్యటించారని పేర్కొన్నారు. ఇందు కోసం రూ.517.82 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిపారు. ఈ పర్యటనల వల్ల ఆర్థిక సంబంధాలు బలోపేతం అయ్యాయని,  పెట్టుబడులు, రక్షణ రంగం మరింత మెరుగుపడిందని చెప్పారు. ముఖ్యంగా  అమెరికా, రష్యా, చైనా, సింగపూర్, యూఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, శ్రీలంక, బ్రెజిల్,థాయ్ లాండ్ దేశాలకు వెళ్లారని అన్నారు. వీటిలో  అమెరికా, రష్యా, చైనా ఐదుసార్లు వెళ్లి వచ్చారు. తొలిసారి భూటాన్ వెళ్లగా.. లాక్‌డౌన్‌కు ముందు చివరి సారిగా బ్రెజిల్‌లో పర్యటించారు. అక్కడి జరిగిన  బ్రిక్స్ దేశాల సదస్సులో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే.