Modi went to Advani's house
mictv telugu

ఎల్‌కే అద్వానీ ఇంటికి మోడీ..అందుకోసమే

November 8, 2022

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 96వ జన్మదినం జరుపుకుంటున్న ఎల్ కే ఆద్వానీ నివాసానికి వెళ్లి ప్రధాని హార్దిక జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం అద్వానీతో కూర్చుని పలు అంశాలపై మోదీ చర్చించారు. ప్రధాని మోదీ దాదాపు 30 నిమిషాల పాటు అద్వానీ నివాసంలోనే ఉన్నారు. అద్వానీ పుట్టిన రోజున ప్రతి సంవత్సరం ఆయన నివాసానికి మోడీ వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. మోడీతో దేశ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీ ఇంటికి వెళ్లి విషెష్ తెలిపారు.

1927 నవంబర్ 8న ఇప్పటి పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని ఎల్‌కే అద్వానీ జన్మించారు. 15 సంవత్సరాల వయుస్సులోనే RSSలో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. 1990 దశకంలో దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీని… దేశవ్యాప్త రథయాత్రతో ఏకంగా కేంద్రంలో అధికారం చేపట్టే దిశగా తీర్చిదిద్దారు. వాజ్‌పేయి ఉన్నంత కాలం రాజీయాల్లో ఓ వెలుగు వెలిగిన అద్వానీ… ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.